Job Notification : తెలంగాణలోని మహిళలకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ ఖాళీల (Job Notification) భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటిని ఆయా జిల్లాల కలెక్టర్లు జారీ చేస్తారు. ఖాళీల భర్తీతో అంగన్వాడీలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఉద్యోగ నోటిఫికేషన్:నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగల భర్తీపై కీలక అప్ డేట్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment