బిజెపి రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

బిజెపి మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి 

ఈరోజు హైదరాబాదులోని బిజెపి రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాస్త ప్రజా రోదనగా మారిందని, ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం రోజుకొక కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పాతేస్తారని హెచ్చరించారు.రేవంత్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలం చెందిందని,దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి,బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post