హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడు పల్లి గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు దబ్బా సుధాకర్ కు కొమరం భీమ్ నేషనల్ అవార్డును అందజేసింది. హైదరాబా దులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాత్రి బహుజన సాహిత్య అకాడమీ ఏడవ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా అకాడమీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా డబ్బా సుధాకర్ కొమరం భీమ్ నేషనల్ అవార్డును -2024ను అందుకున్నారు. ఈ సందర్భంగా రాధా కృష్ణ మాట్లాడుతూ సుధాకర్ నాయక పోడు తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ బహుజన సాహిత్యానికి కృషి చేశా రని అన్నారు. విద్యార్ధి దశలో ఎస్ఎఫ్. పి డి ఎస్ యు ఉద్యమ సంవత్సరంలోపనిచేశారని అన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు మెస్ చార్జీల కోసం ఉద్యమిం చారని అన్నారు. అన్ని వర్గాల హక్కుల కోసం ప్రజా పోరాటాలు చేశారని పేర్కొన్నా రు.తునికాకు కూలీలకు గిట్టుబాటు ధర, గుత్తి కోయిల కోసం ఉద్యమించారన్నారు. వృత్తిలో నిబద్ధతతో పని చేస్తూ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న సుధాకర్ సేవలను గుర్తించి కొమరం భీం నేషనల్ అవార్డుకు అందించడం జరిగింది ఈ అవార్డును తీసుకున్నందుకు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఉపాధ్యాయ వర్గం ప్రజాప్రతినిధులు సుధాకర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్, విష్ణు, వనమాల, పద్మావతి, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
కొమరం భీమ్ నేషనల్ అవార్డు అందుకున్న సుధాకర్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment