ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మరోమారు నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు తీర్పు : ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు ఇటీవలే ముగిశాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది
Post a Comment