కేటీఆర్‌ న్యాయవాదికి ఏసీబీ అనుమతి నిరాకరణ

వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
దీంతో ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగిన కేటీఆర్..
ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడారు. న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. తనను ఏసీబీ అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉందనిఅన్నారు. గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
న్యాయవాదిని తీసుకెళ్లడం నా హక్కు :* తన వాదనను ఇప్పటికే హైకోర్టులో చెప్పానని, న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసిందని తెలిపారు.హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీస్‌కు వచ్చానని, తన లాయర్‌ను తనతో రావొద్దని చెబుతున్నారన్నారు.పోలీసులను నమ్మనని తెలిపారు. న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగపరంగా తనకు ఉన్న హక్కు అని వివరించారు.తాను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నానని, అయినా ఇంతమంది పోలీసులెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. న్యాయవాదిని అనుమతించబోమని ఏసీబీ వాళ్లు చెప్పాలని, పోలీసులు ఎందుకు చెబుతున్నారని మండిపడ్డారు.ఏసీబీ కార్యాలయం నుంచి వెనుదిరిగిన కేటీఆర్ తన తరపు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్‌ వెనుదిరిగారు. అనంతరం ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నోటీసులపై స్పందించారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు బయలుదేరి వెళ్లారు. దీంతో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నట్లు సమాచారం.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post