కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం నియోజకవర్గంలోని సంగెం మండలం చింతలపల్లి, మొండ్రాయి గ్రామాలలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు బానోతు స్వామి, కడ్డూరి భద్రయ్య,చాతాళ్ళ జనార్ధన్,పరికి వెంకటయ్య కుటుంబాలను పరామర్శించి,మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post a Comment