ఏసీబీ రేవంత్ రెడ్డి జేబు సంస్థలా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

తెలంగాణ ప్రతిష్ఠను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీ ఆర్ హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చితే.. ఇప్పుడేమో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని ధ్వంసం చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా కేటీఆర్ తీర్చిదిద్దారు. ఈ ఫార్ములా రేస్ నిర్వహణ కోసం ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. కేటీఆర్ ప్రతిభను చూసి ఫార్ములా ఈ కార్ రేస్‌కు నిర్వాహకులు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. రేవంత్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొలేకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. రేవంత్ కేబినెట్ మంత్రే అవినీతి జరగలేదని చెప్పాడు. అక్రమ కేసు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు కూడా తెలుసు. కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post