BLN తెలుగు దినపత్రిక:
చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చేశారు. ఖాజాగూడ సర్వే నంబరు 18 ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో తొమ్మిది ఎకరాలు, ఏడు గుంటల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కాగా వాటిని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించారు.స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించి 20కి పైగా దుకాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలు కూల్చేయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారుఇంత తక్కువ సమయంలో ఎలా ఖాళీ చేయాలంటూ వాపోయారు.
Post a Comment