PSLV-C60 SpaDeX: అంతరిక్షంలో అద్బుతం.. PSLV-C60 ప్రయోగం గ్రాండ్ సక్సెస్..

PSLV-C60 SpaDeX: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన సంవత్సరానికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. దేశ ప్రజలందరికీ గ్రాండ్ సక్సెస్ తో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది..అంతరిక్ష సాంకేతిక రంగంలో ఎన్నో అద్భుతాలు చేసిన ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో తన PSLV-C60 SpaDeX మిషన్‌ను ప్రయోగించింది. దేశ ప్రజలందరికీ గ్రాండ్ సక్సెస్ తో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలోకి రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ తరహా టెక్నాలజీలో తాజాగా భారత్ కూడా వాటిసరసన చేరింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 10గంటలకు 15 సెకన్లకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి 60 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగవేదిక నుంచి పీఎస్ ఎల్వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1 బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1ఎ రాకెట్ నుంచి విడిపోయింది.ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి. పీఎస్ ఎల్వీ 420 కిలోల బరువు ఉన్న స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్నానంతో రూపొందించిన జంట ఉగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ రెండు చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం..

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post