అక్రమ గ్రావెల్, మట్టి తవ్వకాలకు చెక్ పెట్టాలి!అనుమతుల జారీకి ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IGMS)పారదర్శకత, జవాబుదారీతనంతో సాఫ్ట్‌వేర్ అమలు చేయాలి: కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, నవంబర్ 5: జిల్లాలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టడంతో పాటు, రవాణా అనుమతుల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IGMS) సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారుహైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన IGMS సాఫ్ట్‌వేర్ పనితీరు, రూపకల్పనపై గురువారం కలెక్టర్‌కు అధికారులు వివరించారు. క్షేత్రస్థాయి నియంత్రణ నుంచి జిల్లా స్థాయి పర్యవేక్షణ వరకు వివిధ స్థాయిల్లో అధికారుల విధులు, అనుమతుల జారీ ప్రక్రియ, నివేదికల పర్యవేక్షణ విధానాలను వివరించారుఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రావెల్ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన అనుమతులను IGMS సాఫ్ట్‌వేర్ ద్వారానే జారీ చేసేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. న్యాయపరమైన నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతుల జారీ, పర్యవేక్షణ జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దాలని ఆదేశించారుఅక్రమ తవ్వకాలు, అనధికార రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని తెలిపారు. అనుమతుల జారీ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారుఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు రవి శంకర్, డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీవో సుమ, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు నరేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post