నర్సంపేట ట్రెజరీ కార్యాలయంలో ఇద్దరిపై బదిలీ వేటు!లంచం డిమాండ్ ఆరోపణల నేపథ్యంలో అధికారుల చర్యలుఏటీవో చంద్రకళ కరీంనగర్‌కు.. ఉద్యోగి ఆలేఖ్య కొత్తగూడెంకు బదిలీ

నర్సంపేట: నర్సంపేట సబ్ ట్రెజరీ కార్యాలయంలో లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏటీవో చంద్రకళ, ఉద్యోగి ఆలేఖ్యను గురువారం ఉదయం డీటీవో విజయ సారథి ట్రెజరీ శాఖకు సరెండర్ చేశారు. అనంతరం వారిద్దరినీ వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారుఏటీవో చంద్రకళను కరీంనగర్‌కు, ఉద్యోగి ఆలేఖ్యను కొత్తగూడెంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారంనర్సంపేట ట్రెజరీ కార్యాలయంలో వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాలు, లంచం డిమాండ్ ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సత్య శారద స్పందించారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో ఈ పరిణామం చోటుచేసుకుందిట్రెజరీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post