హైదరాబాద్: భారత పర్యటనలో భాగంగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్‌రావును ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం జాయింట్ సెక్రటరీ అబ్దుల్ ఖుద్దూస్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు అబ్దుల్ ఖుద్దూస్‌ను ఆప్యాయంగా ఆహ్వానించి, ఆయనతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ భేటీలో రాజకీయ, సామాజిక అంశాలతోపాటు యువత పాత్ర, ఎన్నారై యువత రాజకీయాల్లో భాగస్వామ్యం వంటి పలు అంశాలపై చర్చించారు.అబ్దుల్ ఖుద్దూస్ గ్రాడ్యుయేషన్ విజయాన్ని హరీశ్‌రావు మరోసారి అభినందించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తనపై మాజీ మంత్రి చూపిన ఆదరణ, ఆప్యాయత ఎంతో ఆనందాన్ని, సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు.
ఈ మర్యాదపూర్వక భేటీలో ఖుద్దూస్ మిత్రబృందం సభ్యులు పవన్, సాయి ప్రణీత్, రాకేష్, శశి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment