కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ హయాంలోనూ ఓటర్ల జాబితా సవరణ జరిగిందని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాలనలో కూడా ఈ ప్రక్రియ కొనసాగిందని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ ప్రక్రియను చేపట్టిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవారు భారత ప్రధానిని నిర్ణయించలేరని అన్నారు. భారతదేశానికి చెందని వ్యక్తులు, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారి ఓట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరిని కొనసాగిస్తే ఎన్ఆర్సీ (NRC) కూడా అమలు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అక్రమంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులను తిరిగి పంపిస్తామని తెలిపారు.
సోషల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోమని బండి సంజయ్ హెచ్చరించారు.
Post a Comment