హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు కోర్టు ధిక్కరణ కింద ఈ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.. 2025 ఆగస్టు నెలలో తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ పలువురు బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, బాధితుల విజ్ఞప్తులపై 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.అయితే, న్యాయస్థానం నిర్దేశించిన గడువు ముగిసినా ఆదేశాలను అమలు చేయకపోవడంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం కలెక్టర్ నారాయణరెడ్డికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది.
అయితే, తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించిందిన్యాయస్థానాల ఆదేశాలను అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలనే అంశాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.
Post a Comment