ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓజేటీ శిక్షణ ప్రారంభంనర్సంపేట యువ పరివర్తన కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌జాబ్ ట్రైనింగ్ ప్రారంభం

నర్సంపేట: ప్రభుత్వ జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్‌కు చెందిన ఒకేషనల్ OA గ్రూప్ విద్యార్థినీ, విద్యార్థులకు నర్సంపేటలోని యువ పరివర్తన కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆన్‌జాబ్ ట్రైనింగ్ (OJT) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ప్రాక్టికల్ పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, కార్యాలయ విధానాలపై అవగాహన కల్పించనున్నారువిద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా ఆచరణలో పెట్టేందుకు, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఓజేటీ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్ తెలిపారుఈ సందర్భంగా యువ పరివర్తన నర్సంపేట మేనేజర్ సతీష్ అడ్డ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడమే లక్ష్యంగా యువ పరివర్తన సంస్థ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారుఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది బిక్షపతి, సురేందర్, యువ పరివర్తన ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ట్రైనర్లు మహేష్, ప్రియాంక, అఖిల తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post