తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులో లోపాలుపేద, మధ్యతరగతి కుటుం బాలకు కీలకమైన ఆహార భద్రత కార్డుల్లోనే తప్పులు దొర్లాయి. డిజిటల్ విధానంలో ముద్రించి పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్లు, పిన్కోడ్ నంబర్లు తప్పుగా నమోదయ్యాయి. ప్రగతి సింగారం,మైలారం, హుస్సేన్పల్లి సహా పలు గ్రామాల్లో పంపిణీ చేసిన కార్డుల్లో సగానికి పైగా తప్పులు ఉన్నట్లు లబ్ధిదా రులు చెబుతున్నారు. దీంతో కార్డులు చేతికందినా వాటిని ఎలా ఉపయోగించు కోవాలో తెలియక ప్రజలుఆందోళన చెందుతున్నారుకార్డుల్లో కొరవడిన కచ్చితత్వం
ఆహార భద్రత కార్డు కేవలం రేషన్ సరుకుల కోసమే కాకుండా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కీలకమైన ఆధారంగా ఉంది. అలాంటి కార్డుల్లోనే గ్రామం పేరు, పిన్కోడ్ వంటి ప్రాథమిక వివరాలు తప్పుగా ముద్రించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. వివరాలను సరిచూసుకోకుండా కార్డులను ఎలా ముద్రించి పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ కార్డుల పేరుతో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్డుల్లో తప్పుల వల్ల భవిష్యత్తులో సంక్షేమ పథకాల లబ్ధి పొందే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామం పేరు, పిన్కోడ్ సరిగా లేని కార్డులను సవరించి తిరిగి అందించాలని . సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తించి, సరిచేసే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Post a Comment