దళితుల పట్ల వైఖరిపై కేటీఆర్, హరీష్‌రావు స్పందించాలి: దళిత నాయకుడు అజయ్ నల్లబెల్లి డిమాండ్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ ఎర్రవెల్లి పరిధిలో దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన ఘటనపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ మరియు హరీష్‌రావు, నర్సంపేట బిఆర్ఎస్ నాయకులు వెంటనే స్పందించాలని దళితడు అంబేద్కర్ వాది అజయ్ నల్లబెల్లి డిమాండ్ చేశారు.దళితులను అవమానించేలా జరిగిన ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వారు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి మరియు సమానత్వ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు.ఇలాంటి వివక్షపూరిత చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post