శాయంపేట: శాయంపేట మండలంలోని నేరేడుపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా (ఏఈఓ) మారేపల్లి శైలజ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఏఈఓ శైలజ మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలోని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. రైతులు వ్యవసాయ సంబంధిత సమస్యలు, సందేహాలు ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, పంటల సాగులో మెళకువలు, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పిస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
నేరేడుపల్లి క్లస్టర్ ఏఈఓగా మారేపల్లి శైలజ బాధ్యతల స్వీకరణ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment