దివ్యాంగుడికి రైల్వే కన్సెషన్ పాస్, సదరం ఐడీ కార్డు అందజేత

శాయంపేట: దివ్యాంగుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తల్లి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ ఆధ్వర్యంలో శాయంపేట మండలానికి చెందిన దివ్యాంగులకు సహాయం అందించారు.
శాయంపేట మండలానికి చెందిన చిక్కులపల్లి రమాదేవి తరఫున ఆమె భర్తకు రైల్వే కన్సెషన్ పాస్‌తో పాటు సదరం సర్టిఫికెట్ ఐడీ కార్డును తల్లి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ అందజేశారు.
ఈ సందర్భంగా గజ్జి శంకర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ సమితి నిరంతరం కృషి చేస్తోందన్నారు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందేలా అవగాహన కల్పిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.
రైల్వే కన్సెషన్ పాస్, సదరం ఐడీ కార్డు అందజేయడం ద్వారా దివ్యాంగులకు ప్రయాణంలో, ప్రభుత్వ సేవలు పొందడంలో మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post