హరీశ్‌రావును అడ్డుకున్న సుబేదారి పోలీసులు

హనుమకొండ: పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావును సుబేదారి పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హరీశ్‌రావును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post