వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో ఘోర అగ్నిప్రమాదంబాయిలర్ పేలడంతో చెలరేగిన మంటలు.. ఇద్దరు కార్మికులు మృతి చెందినట్టు సమాచారం

వరంగల్: వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో బుధవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గీసుకొండ మండలం గణేశా ఎకోపేటలోని ఓ కంపెనీలో బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న గీసుకొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. బాయిలర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post