శాయంపేట, ఆగస్టు 6: శాయంపేట మండల సర్పంచుల కమిటీ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడిగా పత్తిపాక గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మామిడి అశోక్ (కొప్పుల), చింతల రమ రవిపాల్ (శాయంపేట) ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా మిట్టపెల్లి సతీష్ (సాధనపల్లి), కార్యదర్శులుగా మంద దీనా ప్రభాకర్ (పెద్దకోడపాక), కౌడగాని సుప్రియా (అప్పయ్యపల్లి), నూనె దివ్య తిరుపతి (మైలారం) బాధ్యతలు చేపట్టారు. కోశాధికారిగా వైనాల విజయ కుమారస్వామి (గట్ల కనిపర్తి) ఎన్నికయ్యారు.
ముఖ్య సలహాదారులుగా కూకిడి శివాజీ (కొత్తగట్టు సింగారం), హింగే భాస్కర్ (వసంతపూర్), మలసాని లక్ష్మణ్ రావు (రాజుపల్లి) ఎంపికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా మారబోయిన ప్రభాకర్ (జోగంపల్లి), కత్తుల కుమారస్వామి (గంగిరేగిగూడెం), మాదారపు సరోజన సాంబయ్య (ప్రగతి సింగారం), మడికొండ ఇంద్రరాజు (నేరేడుపల్లి), దొరునాల రమ బాబురావు (ఆరేపల్లి), లౌడియ రమ రవీందర్ (సూర్యనాయక్ తండా), దాసి స్వాతి శ్రావణ్ సరోజన (గోవిందపూర్), కుక్కల సరోజన సాయిలు (తహరపూర్), ఎడ్ల స్వరూప సుధాకర్ రావు (హుసేన్‌పల్లి), వాంగ్డోతు సదర్‌లాల్ (కాట్రపల్లి), అల్లే రాజీరు (నూర్జహాన్‌పల్లి), గోనె నాగరాజ్ (నరసింహులపల్లి), సూరం శశిపాల్ రెడ్డి (సూరంపేట) ఎన్నికయ్యారు.
నూతన కమిటీ సభ్యులు మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, సర్పంచుల హక్కుల పరిరక్షణ కోసం సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
Post a Comment