శాయంపేట, ఆగస్టు 1 (BLN తెలుగు దినపత్రిక): శాయంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను బహుజన సంక్షేమ సంఘం (బీఎస్‌ఎస్) నాయకులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా బీఎస్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారెపల్లి క్రాంతికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సామాజిక, నైతిక విలువలను కూడా బోధించాలని సూచించారు. క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన అలవర్చేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
విద్యార్థులు మానసికంగా, వ్యక్తిత్వ పరంగా ఎదగాలంటే ఉపాధ్యాయులు వారికి మెరుగైన శిక్షణ అందించాలని పేర్కొన్నారు. "ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. నేటి విద్యార్థులే రేపటి భారత పౌరులు. వారిని మంచి మార్గంలో తీర్చిదిద్దడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత" అని ఆయన అన్నారు.
కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మాధవితో మాట్లాడుతూ, ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ సానిటైజేషన్ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రాత్రి వేళల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్, హనుమకొండ జిల్లా కార్యదర్శి మారెపల్లి విజయ్ కుమార్, శాయంపేట మండల అధ్యక్షుడు మారపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment