తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట, జూలై 31:
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే తీజ్ పండుగను భావితరాలకు పరిచయం చేస్తూ ఆచారాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
శుక్రవారం శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా మరియు గంగిరేణి గూడెం గ్రామాల్లో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన యువతులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, వారి సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయ పండుగలు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, గంగిరేణి గూడెం సర్పంచ్ కుమారస్వామి, వైనాల కుమారస్వామి, దుబాసి కృష్ణమూర్తి, నిమ్మల రమేష్, సుమన్, రఘు, కృష్ణమూర్తి, శానం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post