శాయంపేట, జూలై 30 (వార్త):
శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో గిరిజనులు తమ సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకగా ఘనంగా నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిరిజన సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో ఆప్యాయంగా మమేకమై వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనుల సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. తీజ్ వంటి పండుగలు గిరిజనుల ఐక్యతకు, సంస్కృతి పరిరక్షణకు ప్రతీకలని ఆయన అన్నారు.
అనంతరం గ్రామస్తులతో కలిసి పండుగ కార్యక్రమాలను వీక్షించి, గిరిజనుల ఆనందోత్సాహాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాయంపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post a Comment