శాయంపేటలో జ్వరాల సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహణవర్షాకాల వ్యాధుల నివారణపై ప్రజలకు వైద్యశాఖ అవగాహన

శాయంపేట, జూలై 30: వర్షాకాలంలో ప్రబలే జ్వరాలు, దోమలు, ఈగలు, గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం శాయంపేట గ్రామంలో విస్తృత కార్యక్రమం నిర్వహించారు. శాయంపేట వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్య సూచనలు అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అభినందన్ రెడ్డి మాట్లాడుతూ, దోమలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వేడి వేడి, తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, చిన్న పరిమాణంలో ఉన్న దోమలు, ఈగలు వ్యాప్తి చేసే వ్యాధులు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేమలత, పబ్లిక్ హెల్త్ నర్స్ శోభ, సబ్ యూనిట్ ఆఫీసర్ విప్లవ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ కె. భద్రయ్య, హెల్త్ అసిస్టెంట్లు చలపతి, శివాజీ, సిస్టర్ శ్రావణి, ఆశ కార్యకర్తలు లత, శకుంతల, ప్రేమలత, రజితతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post