శాయంపేట మండలంలో సోలార్ సీసీ కెమెరాల డెమో – నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి: సీఐ సుధాకర్ రెడ్డి

శాయంపేట, జూలై 20: శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీల సహకారంతో సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సోమవారం డెమోన్స్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందని శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై పరమేష్ తెలిపారు.
ఆరెపల్లి గ్రామంలో సర్పంచ్ దుర్నాల రమ–బాపూరావు, ఉప సర్పంచ్ వల్లెపు తిరుపతి రెడ్డి, గ్రామ పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.25,000 విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల డెమో నిర్వహించారు.
అలాగే కాట్రపల్లి గ్రామంలో సర్పంచ్ వంకుడోత్ సదర్ లాల్, ఉప సర్పంచ్ సంగాల బిక్షపతి, గ్రామ పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.37,500 విలువైన ఆరు సోలార్ సీసీ కెమెరాల డెమోన్స్ట్రేషన్ చేపట్టారు.
సూర్యానాయక్ తండాలో సర్పంచ్ లావుడ్య రమ–రవీందర్, ఉప సర్పంచ్ మాలోతు సునీత, గ్రామ పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.25,000 విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల డెమో నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై పరమేష్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు తమ ఇళ్లు, ప్రధాన కూడళ్లు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు నేరాల నివారణకు, నేరస్తులను త్వరగా గుర్తించేందుకు ఎంతగానో దోహదపడతాయని, గ్రామాల భద్రత కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post