మాందారిపేటలో సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారంటెక్నీషియన్‌కు రూ.20 వేల అందజేత – అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ పిలుపు

శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదివారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో శాయంపేట సీఐ బై సుధాకర్ రెడ్డి, ఎస్ఐ జక్కుల పరమేశ్వర్ సమక్షంలో టెక్నీషియన్‌కు రూ.20 వేల నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post