పాడి పరిశ్రమ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో ఎన్డీడీబీ చైర్మన్ భేటీ

హైదరాబాద్, ఏప్రిల్ 3:
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB) చైర్మన్ డాక్టర్ మీనేష్ షా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మదర్ డైరీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయతీర్థ చారి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన వ్యూహాలు, రైతులకు లాభదాయకమైన విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలపై చర్చించారు. డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం, సంబంధిత సంస్థలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post