శాయంపేట మండలం పెద్దకొ డెపాక గ్రామంలో 99 రోజుల ప్రణాళిక ఆధారంగా ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావుమాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల అమలు గురించి వివరించారు. స్థానిక వార్డుల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మరియు విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే కార్యక్ర మాలు గృహలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్, మహా లక్ష్మి పథకం ద్వారా మహి ళలకు ఉచిత బస్ సౌకర్యం, విద్యారంగ అభివృద్ధిపై కీలక అంశాలను ప్రస్తావించారు. మండల రైతుల కోసం మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభి స్తున్నామని ఎమ్మెల్యే ప్రకటిం చారు. ప్రజల సమస్యలను పరిష్కరించి సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్య క్రమంలో అడిషనల్ కలెక్టర్ రవి, ఆర్డీవో నారా యణ, ఏడిఏజగదీష్ రెడ్డి ఏవో శ్రీనివాసరావు ఎంపీడీవో ఫణి చంద్ర, ఎంపీఓ రంజిత్ కుమార్, మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, రవీందర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికమహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment