మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన సీఐ రంజిత్ రావు

శాయంపేట, ఏప్రిల్ 18:
శాయంపేట మండల కేంద్రంలోని ప్రజల కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ కూడా పాల్గొన్నారు.
కీర్తిశేషులు బాసని కైలాసం, కనక లక్ష్మి, రమాదేవి (మాజీ ఎంపీపీ) జ్ఞాపకార్థంగా మాజీ ఎంపీపీ, తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డు సభ్యుడు బాసని చంద్రప్రకాశ్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఐ రంజిత్ రావు మాట్లాడుతూ, మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఇంకా ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి మండలంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బాసని లక్ష్మీనారాయణ, సదాశివుడు, వెంకటపతి, చంద్రమౌళి, సామల రవీందర్, బాసని వెంకటేశ్వర్లు, గడ్డం బాబు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post