సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగజన సశక్తికరణ విభాగం కార్యదర్శి వి. విద్యావతి సోమవారం న్యూఢిల్లీ నుండి ఆస్పిరేషన్ జిల్లాల్లో కొనసాగుతున్న Unique Disability ID (UDID) కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా ఆస్పిరేషన్ జిల్లాల్లో దివ్యాంగులకు యూ.డి.ఐ.డి కార్డుల జారీ ప్రక్రియ, నమోదు పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల లబ్ధి చేరే విధానం వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. యూ.డి.ఐ.డి కార్డు ద్వారా దివ్యాంగులు వివిధ ప్రభుత్వ పథకాలు, రాయితీలు, సేవలను సులభంగా పొందగలరని కార్యదర్శి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ జిల్లాల్లో నమోదు చేసుకున్న ప్రతి దివ్యాంగుడికి రాబోయే రెండు నెలల్లో యూ.డి.ఐ.డి కార్డు మరియు సదరం సర్టిఫికేట్ అందేలా చర్యలు చేపట్టాలని సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లకు సూచించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యూ.డి.ఐ.డి అమలు పురోగతిని రాష్ట్ర సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ వివరించారు. భూపాలపల్లి జిల్లా లో చేపడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కార్యదర్శి అభినందిస్తూ, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, డి.ఆర్.డి.ఓలు, డి.పి.ఎంలు తదితర అధికారులు పాల్గొన్నారు.
Post a Comment