తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా గురువారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనకు గవర్నర్‌గా ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి మరియు ఇతర ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు.
Post a Comment