బీఆర్ఎస్ నాయకుడు జునూరి లింగమూర్తి దశదినకర్మకు పార్టీ శ్రేణుల నివాళి

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జునూరి లింగమూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన దశదినకర్మ సందర్భంగా గురువారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు.
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం లింగమూర్తి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం లింగమూర్తి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గండు శ్రీధర్, ఉపసర్పంచ్ మేడిపెల్లి శంకరయ్య, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు కందికొండ రాములు, యూత్ అధ్యక్షులు ఇస్లావత్ రమేష్, 5వ వార్డు సభ్యురాలు భూక్య సుజాత మధుకర్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జంగిలి వెంకట్రాజ్, మాజీ ఉపసర్పంచ్ క్రిస్టోజ్ బ్రహ్మచారి, సీనియర్ నాయకులు మేడిపెల్లి సదయ్య, సంఘ సమ్మయ్య, కొల్లూరి శంకరయ్య, గాజులపాటి బిక్షపతి, కందకట్ల ఆనందం, గాజులపాటి కిషన్, ఇస్లావత్ సంగులాల్, నత్తి శ్యాము, దూడల రాజేష్, ఇస్లావత్ గణేష్, గుగులోత్ విజేందర్, పోరిక రాజేందర్, ఇస్లావత్ సన్నీ, ఎండి మైనుద్దీన్, గుగులోత్ సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
వారు లింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post