భూపాలపల్లి జిల్లా ప్రజలకు రంగుల పండుగ హొలీ శుభాకాంక్షలను రాహుల్ శర్మ తెలిపారు. హొలీ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత, స్నేహభావాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హొలీ పండుగ మన భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన పండుగ అని పేర్కొన్నారు. చెడుపై మంచి విజయం సాధించిన సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు. ప్రజలు పరస్పరం ప్రేమ, సౌహార్దంతో హొలీ పండుగను జరుపుకోవాలని సూచించారు.
పండుగ వేడుకల సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే రంగులతో ఆడాలని సూచించారు. రసాయన పదార్థాలు కలిగిన రంగులను ఉపయోగించకుండా సహజసిద్ధమైన రంగులను వినియోగించాలని తెలిపారు.
అలాగే హొలీ ఆడిన తరువాత చెరువులు, వాగులు, నదుల్లో స్నానాలకు వెళ్లకూడదని, సరదా మాటున ప్రమాదం పొంచి ఉండవచ్చని హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడుతూ హొలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు.
Post a Comment