మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ ప్రమాణాలు

తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు సమీపంలో నిర్మించనున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కలిసి కోరారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు .ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్, ఓవర్‌హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ పారిశ్రామిక కేంద్రంగా, మేడారం జాతరలతో ప్రసిద్ధి చెందుతున్న నగరానికి ఈ విమానాశ్రయం కీలకమని వివరించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులను త్వరలో మామునూరుకు పంపి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు . ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, గడ్డం వంశీకృష్ణలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post