కొత్తపేట్‌లో విలేఖరుల బెదిరింపు

.మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన సునావత్ విజేష్ సొంత ఇంటి నిర్మాణానికి కొత్తపేట వాగు నుండి ఇసుక తీసుకుంటుండగా ముగ్గురు పత్రికా విలేఖరులు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. తుడుం జితేందర్ (జనం పవర్, కవ్వాల గ్రామం), అంబటి శరత్ (పోరు తెలంగాణ, కవ్వాల గ్రామం), దాసండ్ల నవీన్ (చార్మినార్ ఎక్స్‌ప్రెస్, కొత్తపేట గ్రామం)లు ఆయనను ఫోటోలు తీస్తూ, ప్రతి ఒక్కరికి నెలకు 5 వేల రూపాయలు ఇవ్వాలి లేదా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు, పత్రికల్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు.గురువారం ఉదయం 9 గంటల సమయంలో విజేష్ ట్రాక్టర్‌లో ఇసుక తీసుకుంటొచ్చాడు, గ్రామ శివారులో ముగ్గురు విలేఖరులు అడ్డుకుని డబ్బులు ఇవ్వకపోతే ట్రాక్టర్‌ను ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామని భయపెట్టారు. గత 15 రోజుల నుంచి ఇలాంటి బెదిరింపులు జరుగుతున్నాయని భాదితుడు తెలిపాడు.ఈ ఫిర్యాదు మేరకు జన్నారం పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post