యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్‌ఎస్‌

యాదగిరిగుట్ట. భువనగిరి జిల్లా, ఫిబ్రవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (జీఎస్‌ఎస్‌ఆర్) శనివారం ఉదయం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు.ప్రజల సుఖసంతోషాలు, నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించిన ఎమ్మెల్యే... స్వామి కృపతో రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షించారు.దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదం అందజేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post