పరకాల మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో

 బీజేపీ ఉత్సాహం.. కాంగ్రెస్ నేత వేముల ఆంజనేయులు చేరికపరకాల మున్సిపల్ చైర్మన్ పదవి బీజేపీ కైవసం.. 22 వార్డుల్లో పోటీపరకాల, జనవరి 20: పరకాల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటుందని బీజేపీ నియోజకవర్గ మున్సిపల్ ఇన్‌చార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.సమావేశంలో పరకాల బీజేపీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే పగడాల కాళీ ప్రసాద్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రముఖ నేత, వ్యాపారవేత్త వేముల ఆంజనేయులు బీజేపీలో చేరారు. పార్టీ నాయకులు ఆయనకు కండువ కప్పి ఆహ్వానించారు.కార్యకర్తలకు ఎర్రబెల్లి సూచనలుఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ, ప్రతి బూత్‌ను కేంద్రంగా ఇంటింటి ప్రచారం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ఓటర్లతో సంప్రదింపులు కొనసాగించాలని, సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ప్రచారం చేయాలని అన్నారు. యువత, మహిళలు, లబ్ధిదారులతో సమీక్షలు నిర్వహించి పార్టీపై విశ్వాసం పెంచాలని పిలుపునిచ్చారు.ఎన్నికల రోజున ప్రతి ఓటరు బూత్‌కు చేరేలా సమన్వయం చేయాలని, పోలింగ్ ఏజెంట్లు సమయానికి హాజరుకోవాలని తెలిపారు. క్రమశిక్షణ, ఐక్యతతో పనిచేస్తే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.22 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులుపగడాల కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. టికెట్ ఆశావాహులు ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు అందరూ మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు.డాక్టర్ విజయచందర్ రెడ్డి, సంతోష్ కుమార్ మాట్లాడుతూ, పరకాలలో బీజేపీకి బలమైన ఆదరణ ఉందని, ప్రజలు మోడీ పథకాలు గుర్తుంచుకుని ఓటు పడుస్తారని అన్నారు. పార్టీ నిబద్ధ కార్యకర్తలకే ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.పాల్గొన్నవారుకాచం గురు ప్రసాద్, గుజ్జ సత్యనారాయణ రావు, మేకల రాజవీరు, కందిమల్ల మహేష్, జయంత్ లాల్, మేఘనాథ్ దేవనూరి, సిరంగి సతీష్ కుమార్, దగ్గు విజేందర్ రావు, చందుపట్ల రవీందర్ రెడ్డి, కుక్కల విజయకుమార్, మార్త రాజభద్రయ్య, మారేడుగొండ భాస్కరాచారి, దారుణ నారాయణదాసు, మిడిదొడ్డి నరేష్, దంచనాదుల కిరణ్, ముత్యాల దేవేందర్, దారుణ సునీల్, ఆకుల రాంబాబు, ఆకుల శ్రీధర్, గోనెల నరసింహ, మహిళా నాయకురాలు వినిశెట్టి శారద, వేముల సుధారాణి, ఫైండ్ల రంజిత్, సూర్యదేవర సదానందం తోపాటు బూత్ అధ్యక్షులు, మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యకర్తలు పార్టీ విజయానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post