ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న జెపి నడ్డా స్థానంలో 45 ఏళ్ల నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. *ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని* చెప్పారు. గతంలో అద్వానీ, వెంకయ్యనాయుడు నేతృత్వంలో అద్భుత విజయాలు సాధించామన్నారు. ప్రజాస్వామ్యపరంగా బీజేపీలో నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. అందరి కృషితో మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. దేశ సేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటుందని.. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బీజేపీ పటిష్టంగా ఉందన్నారు . బీజేపీలో కష్టపడే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు మోదీ.
బిజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment