హనుమకొండ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్‌లో రేపు జరిగే ఒకరోజు దీక్షను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ పిలుపునిచ్చారు.గత ఎనిమిది సంవత్సరాలుగా డాక్టర్ చీమ శ్రీనివాస్ చేస్తున్న కృషి ఫలితంగానే ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. రెండు సంవత్సరాలు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందని విమర్శించారు.రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఈ ఒకరోజు దీక్షను విజయవంతం చేయడానికి ఫోరం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, డివిజన్ నాయకులు, నియోజకవర్గ నాయకులు, గ్రామస్థాయి నాయకులు సహా అందరూ పాల్గొనాలని ఉద్యమకారులను కోరారు.:
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
పొడి శెట్టి గణేష్
Post a Comment