శాయంపేట జనవరి 5 (BLN తెలుగు దినపత్రిక) గొర్ల మంద నుంచి గొర్రెను ఎత్తుకెళ్లిన సంఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లాకు చెందిన అరవ అనంత రాములు తో పాటు ఐదుగురు గత కొద్ది రోజులుగా మైలారం గ్రామ శివారులో రైతుల అనుమతితో అయిపోయిన పంట చేల్లల్లో గొర్ల మందను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ నెల ఒకటిన మైలారం శివారు జోగంపల్లి గ్రామం నుంచి మైలారం వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉన్న చల్ల మహేందర్ రెడ్డి పంటలో గొర్లు మేయడంతో మహేందర్ రెడ్డి గొడవకు దిగడంతో గొర్ల కాపర్లు అతడిని బ్రతిమిలాడడం జరిగింది. ఈ సమయంలో మైలారం గ్రామానికి చెందిన దూదిపాల తిరుపతిరెడ్డి, అర్జల సాంబ రెడ్డి తో పాటు మరికొంతమంది కారులో వచ్చి గొర్ల మంద నుంచి ఓ గొర్రెను కారులో వేసుకుని పారిపోయారు. గొర్ల కాపరులు వారిని వెంబడించినప్పటికీ వారు దొరకలేదు. దీంతో అదే రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గొర్రె దొంగలపై కేసు నమోదు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment