హరిహర క్షేత్రంలో 14వ వార్షికోత్సవం..18 కలశాలతో మహా పడిపూజ

పరకాల  పట్టణంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 18 కలశాలతో మహా పడిపూజ జరగనుంది.ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పరకాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా పడిపూజలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని కమిటీ కోరింది.
పడిపూజ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post