బిగ్ బ్రేకింగ్ న్యూస్ | రైతు బంధుపై కీలక ప్రకటన

ఇప్పట్లో రైతు బంధు లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఎదురుచూస్తున్న రైతు బంధు పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పట్లో రైతు బంధు అమలు ఉండదని ఆయన తేల్చిచెప్పారు.సర్పంచ్ ఎన్నికలు ముగిసినా, ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోవడం నేపథ్యంలో ఇప్పుడే రైతు బంధు విడుదల చేస్తే వృధా అవుతుందనే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో ఇవ్వాల్సిన రైతు బంధు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.సాగుభూముల లెక్కలు తేలిన తరువాతే రైతు బంధు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంట సాగు భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి, ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత వచ్చే నివేదిక ఆధారంగా మాత్రమే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
ఈ నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొనగా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైన లెక్కలతో న్యాయంగా నిధులు చేరవేయడానికేనని మంత్రి వివరణ ఇచ్చారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post