గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

మూడు దశలలో ఎన్నికల నిర్వహణ.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ.
జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల సహాయక కేంద్రం ఫోన్ నెంబర్ 7981975495జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
హన్మకొండ: 28 నవంబర్ 2025
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మూడు దశలలో ఎన్నికల నిర్వహణ జరుగుతుందని, ఉల్ ఈరోజు(27వ తేదీ గురువారం) నుంచి నామినేషన్ లను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశలలో నిర్వహించడం జరుగుతుందని మొదటి విడతలో భిమాదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మూడు మండలాలలోని 69 గ్రామపంచాయతీలకు 658 వార్డు లకు నేటి (ఈ నెల 27 తేదీ) నుండి నామినేషన్ ల స్వీకరిస్తున్నట్లు , తేదీ.11.12.2025 గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 
రెండవ దశ పోలింగ్ ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మొత్తం ఐదు మండలాలలోని 73 గ్రామ పంచాయతీలకు , 694 వార్డ్ లకు, తేదీ.30.11.2025 ఆదివారం నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం అవుతుందని , తేదీ.14.12.2025 ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 
మూడవ దశలో ఆత్మకూరు, దామెరా,నడికూడ, శాయంపేట్ నాలుగు మండలాలలోని 68 గ్రామపంచాయతీలకు , 634 వార్డ్ లకు తేదీ.03.12.2025 బుధవారం రోజున నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం అవుతుందని తేదీ.17.12.2025 బుధవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 
 2.9.2025 ఫోటో ఎలాక్టోరల్ రోల్ ప్రకారం జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 3,70,871 ఓటర్లు ఉండగా 1,80,666 పురుషులు, 1,90,201 మహిళలు, నలుగురు ట్రాన్స్జెండార్స్ ఉన్నారని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కగా అమలయ్యేలా నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. 2382 బ్యాలెట్ బాక్సస్లు అవసరముండగా20 శాతం అధికంగా 3070 బ్యాలెట్ బాక్స్ లను అందుబాటులో వుంచినట్లు అన్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా పోలింగ్ మెటీరియల్ కిట్లుపంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు 1480 పి ఓ లు, 1891 ఓ పి ఓ లను నియమించినట్లు తెలిపారు. 
మొదటి విడతలో పోలింగ్ జరిగే 658 పోలింగ్ స్టేషన్ల లో సమస్యాత్మకమైన 14 గ్రామ పంచాయతీ ల్లోని 166 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిసృన్నట్లు, అదేవిధంగా రెండవ విడతలో 18 గ్రామ పంచాయతీల్లోని 208 పోలింగ్ కేంద్రాలలో, మూడవ విడతలో 20 గ్రామ పంచాయతీల్లోని, 212 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ తో పాటు 66 మంది మైక్రో అబ్జార్వర్లను నియమించామని తెలిపారు.
ప్రతి మండలంలో క్లస్టర్ లను ఏర్పాటు చేశామని నామినేషన్ దాఖలాలు చేసే అభ్యర్థులు వారి క్లస్టర్ లో సూచించిన గ్రామపంచాయతీలలో నామినేషన్ సమర్పించవచ్చని పేర్కొన్నారు.
 ఓటింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పరిశీలించడానికి వ్యయ పరిశీలకులను కూడా సిద్ధం చేశామని , సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు 5 వేల జనాభా కు పైగా ఉన్న గ్రామాలలో సర్పంచ్ అభ్యర్ధి 
2 లక్షల 50 వేల రూపాయల వరకు
వార్డ్ సభ్యులకు 50 వేల రూపాయలు, 5 వేల జనాభా తక్కువగా ఉన్న గ్రామాలలో ఒక లక్ష 50 వేల రూపాయలు వార్డ్ సభ్యులు 30 వేలవరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రతి మండలానికి రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, జిల్లా సరిహద్దుల్లో 4 ఎస్ ఎస్ టి బృందాలు కటాక్షపూర్, ఎల్కాతుర్తి, ఫున్నెల్ క్రాస్ రోడ్, పెద్దపెండ్యాల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ లకు, ఎస్ సి పి సి సర్వే 2024 డాటా ప్రకారం బీసీలకు ఇతరులకు డెడికేషన్ కమిటీ 46 జీవో నెంబర్ ను అనుసరించి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని అన్నారు.ఎన్నికల అభ్యర్థులకు ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రంలో , స్థానిక ఎంపీడీవో కార్యాలయాలలో హెల్ప్ లైన్ డెస్క్ లను ఏర్పాటు చేశామని వీటి ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల సహాయక కేంద్రం 24 గంటల పాటు పనిచేస్తుందని, ఎన్నికలకు సంబంధించి సందేహాలు, ఫిర్యాదుల కోసం సహాయక కేంద్రం ఫోన్ నెంబర్ 7981975495 ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కలెక్టర్ స్నేహ శబరిష్ కోరారు. 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post