హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ఎంపీడీవోలు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్, హనుమ కొండ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం నుంచి మొద లవుతుందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సంబంధిత మండలాల ఎంపీడీవోలు, అధికారులు పూర్తిచేయా లని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి రెండో విడతలో నామినేషన్లు ఈ నెల 30 నుండి డిసెంబర్ 2 తేదీ వరకు స్వీకరించనున్న ధర్మసాగర్, హసన్ పర్తి, ఐనవోలు, పరకాల, వేలేరు మండలాల ఎంపీడీవోలు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీడీవోల వద్ద నుండి నామి నేషన్ల సామగ్రిని రిటర్నింగ్ అధికారులు వెంటనే తీసుకోవాలన్నారు. నామినేషన్ల సామగ్రిని తనిఖీ చేసుకోవాలని సూచించారు. క్లస్టర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ చేయడంలో ఆలస్యం జరగ కుండా చూసుకోవాలని తెలిపారు. ఎంసీసి నిబంధనలు పాటించా లని, ఎఫ్ఎస్ టి, ఎస్ఎస్ టి బృందాలు తనిఖీలు చేయాలన్నారు. కాగా రెండవ విడతలో ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ జరిగే ధర్మసాగర్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు, 186 వార్డులు, 186 పోలింగ్ కేంద్రాలు, హసన్ పర్తి మండలంలో 15 గ్రామ పంచా యతీలు, 138 వార్డు స్థానాలు, 138 పోలింగ్ కేంద్రాలు, ఐనవోలు మండలంలో 17 గ్రామపంచాయతీలు, 170 వార్డులు, 170 పోలింగ్ కేంద్రాలు, వేలేరు మండలంలో 12 గ్రామ పంచాయతీలు, 106 వార్డులు, 106 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పరకాల మండలంలో 10 గ్రామపంచాయతీలు, 94 వార్డులు, 94 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
No title
byBLN TELUGU NEWS
-
0
Post a Comment