శాయంపేట మండలంలోగ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా సూర్య నాయక్ తండకు ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేయునట్లు జర్పుల గీత ప్రకటించారు.గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధాన్యతలు అని పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన ప్రతీ పనిని సాధించేందుకు కృషి చేస్తాను” అని చెప్పారు. నిరంతర ప్రజాసేవ చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు.ప్రజల హృదయాలలో నిలవడమే నా లక్ష్యం అంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. గ్రామ ప్రజల అభిమానం, సహకారమే తమ విజయం నిర్ణయిస్తుందని అన్నారు.
సూర్యనాయక్ తండా గ్రామ ప్రజలకు సేవ చేయడం నా లక్ష్యంఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: జర్పుల గీత
byBLN TELUGU NEWS
-
0
Post a Comment