హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో మంగళవారం ఉరుములతో కూడిన వర్షం అకస్మాత్తుగా పిడుగు పడి గ్రామానికి చెందిన కూస మహిపాల్ తో పాటు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన మహిపాల్ పార్థివ దేహానికి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు రామ్ చందర్ రావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం వారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగే మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చి గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వెంటనే మహిపాల్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు
వ్యవసాయ పొలం వద్ద పిడుగు పడడంతో రైతు తోపాటు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన
byBLN TELUGU NEWS
-
0
Post a Comment