భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భీమన్న ఆలయంలో రాజన్న మొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు చేయడంపై బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారనిప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆలయం మూసివేస్తే పంచలు కట్టుకుని వచ్చి మరీ ఆలయం తలుపులు తెరుస్తాంఅన్నారు. ఫైరింగ్ చేస్తారో లాఠీచార్జి చేస్తారో చూద్దామనిచెప్పారు. ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని ఆలోపు ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తాంఅన్నారు. తాజాగా బీజేపీ కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్రమంత్రి బండి సంజయ్ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి మేం భక్తులకు అండగా నిలుస్తామన్నారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్నకు సమర్పించే ఆర్జిత సేవలు, కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కోడెమొక్కులు అంటేనే రాజన్నకు చెల్లిస్తామని బండి సంజయ్ అన్నారు. ఆలయాల మూసివేత కావాలనే చేస్తున్నారని మనమంతా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రజల సమ్మతి లేకుండా ఆలయం మూసివేస్తే అందరం కలిసి రోడ్డెక్కాల్సిందేనన్నారు. ప్రజల సెంటిమెంట్‍ను విస్మరిస్తే సహించేది లేదన్నారు. *కొందరు ఏడాది పాటు ఆలయం మూసివేస్తారని చెబుతుంటే మరికొందరు ఆర్నెళ్లు మూసివేస్తారని చెబుతున్నారని* మండిపడ్డారు. ఆలయ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. కానీ ఇది పేరు ప్రతిష్టల కోసం జరుగుతోందనిఆరోపించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post