డి ఎస్ ఓ కార్యాలయంలో విజిలెన్స్

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ధాన్యం స్కామ్ వ్యవహారంలో విజిలెన్స్ విచారణ కొనసాగిస్తుంది…ఇప్పటికే నిన్న శాయంపేటలో విచారణ కొనసాగించిన విజిలెన్స్ బృందం బుధవారం సివిల్ సప్లయీస్ కార్యాలయంలో పలువురిని విచారించింది….ఈ కుంభకోణం లో పౌర సరఫరాల శాఖ డి ఎం ,ఇంచార్జ్ డి ఎస్ ఓ ను సైతం విజిలెన్స్ అధికారులు విచారించినట్లు తెలిసింది…అలాగే శాయంపేట మండలానికి చెందిన కొందరు ఐ కే పి నిర్వాహకులను సైతం విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు…భోజన విరామ సమయం తర్వాత కూడా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది…ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఐకేపీ సెంటర్లు కేంద్రంగా జరిగిన ధాన్యం స్కాముల్లో ఇది రెండో అతిపెద్ద స్కామ్ గా అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది….

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post